సిక్సర్ల శర్మ

గల్లీలో సిక్సర్‌ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్‌ ఉంటుంది.. ఇది ‘సాహో’ సినిమాలోని ఓ డైలాగ్‌. మైదానంలో సిక్సర్లు కొట్టేవాడికి నిజంగానే ఓ రేంజ్‌ ఉంటుంది. కానీ ఒక ఆటగాడి
విషయంలో మాత్రం రేంజ్‌ అనేది చాలా చిన్నపదం. ప్రేక్షకులకు కంటి నిండి వినోదాన్నిస్తూ... సిక్సర్లు బాదడం. ఇంత సులభమా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడా విధ్వంసకారుడు. కళాత్మక ఆటతీరుతో కళ్లు తిప్పుకోనివ్వకుండా బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తూ.. ఆకాశమే హద్దుగా సాగుతున్నాడు. అతడెవరో కాదు.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఉరఫ్‌ సిక్సర్ల శర్మ. తాజాగా బంగ్లాదేశ్‌తో రెండో టీ20ల్లో ఆరు సిక్సర్లతో హోరెత్తించిన అతడు బంతిని ప్రేక్షకుల్లోకి పంపించాలంటే ఉండాల్సింది కండలు కాదు.. మంచి టైమింగ్‌ అని అంటున్నాడు. సిక్సర్లు ఎలా కొట్టాలో చెబుతున్నాడు. మీరూ చదివేయండి.

‘‘సిక్సర్లు కొట్టడానికి కండలు లేకున్నా పర్వాలేదు. నువ్వు (చాహల్‌) కూడా బంతిని ప్రేక్షకుల మధ్యలోకి పంపించగలవు. సిక్సర్లు బాదడానికి కేవలం బలం ఉంటే సరిపోదు. మంచి టైమింగ్‌, తల నుంచి మొదలు శరీరమంతా నియంత్రణలో ఉండాలి. అన్నీ సరిగ్గా కుదిరితేనే సిక్సర్లు కొట్టగలం. బంగ్లా స్పిన్నర్‌ మొసాదెక్‌ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో అన్ని బంతులను స్టాండ్స్‌లోకి పంపిద్దామనుకున్నా కానీ వీలుకాలేదు’’ అని మ్యాచ్‌ అనంతరం చాహల్‌తో రోహిత్‌ చెప్పాడు. సిక్సర్లు బాదేందుకు తను అనుసరించే శైలిని అతడు వివరించాడు. రోహిత్‌ కొట్టిన సిక్సర్లను గమనిస్తే మీకు ఆ విషయం అర్థమౌతుంది. అతని షాట్లలో ఎక్కడా లోపం కనిపించదు. ఏదో గుడ్డిగా బ్యాట్‌ను ఊపేయడం అతడికి తెలియదు. బంతిపై అతని అంచనా తప్పదు. బ్యాట్‌పై పట్టు, శరీరంపై నియంత్రణ, కచ్చితత్వంతో కూడిన టైమింగ్‌తో షాట్‌.. ఇంకేముందీ బంతి ప్రేక్షకుల వైపు వేగంగా దూసుకుపోతుంది. లక్ష్యాన్ని చేరుతుంది. అతని సిక్సర్లలో మరో ప్రత్యేకత ఉంది. ఏ షాట్‌ ఒకే తీరుగా ఉండదు. దేనికి అదే ప్రత్యేకంగా నిలుస్తుంది. చూస్తున్నా కొద్దీ.. ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది.

కట్టిపడేస్తాడు..
ఒక్క సారి క్రీజులో కుదురుకుంటే రోహిత్‌ ఎవరి మాట వినడు. బ్యాట్‌ చెప్పిందే చేస్తాడు. బంతికి శిక్ష వేస్తూనే ఉంటాడు. ఇదంతా చదువుతుంటే అతిశయోక్తిగా అనిపిస్తుందా? ఐతే మీరు ఒక్కసారి రోహిత్‌ సిక్సర్ల రికార్డులను తిరిగేయాల్సిందే. ఈ ఏడాది అతను అన్ని ఫార్మాట్లలో కలిసి ఇప్పటికే 66 సిక్సర్లు కొట్టాడు.

వన్డేల్లో..
* అత్యధిక సిక్సర్లు (232) బాదిన భారత ఆటగాడు
* ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అఫ్రిది (351), గేల్‌ (331), జయసూర్య (270) తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు.
* ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన రెండో ఆటగాడు. ఇయాన్‌ మోర్గాన్‌ (17) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20ల్లో..
* ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సిక్సర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో ప్రస్తుతానికి 115 సిక్సర్లున్నాయి. మార్టిన్‌ గప్తిల్‌ (108) రెండో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో..
* అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ఆరో స్థానం (51)లో ఉన్నాడు. సెహ్వాగ్‌ (91), ధోని (78), సచిన్‌ (69), కపిల్‌ దేవ్‌ (61), గంగూలీ (57) ముందున్నారు.
* ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల (13) రికార్డు రోహిత్‌ ఖాతాలోనే ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అతడు వసీమ్‌ అక్రమ్‌ (12)ను అధిగమించాడు.

‘‘ఒక ఓవర్లో 3-4 సిక్సర్లు కొట్టడం.. 45 బంతుల్లో 80-90 పరుగులు సాధించడం ఓ కళ. రోహిత్‌లా ఆడటం కోహ్లికి కూడా సాధ్యం కాదేమో. కోహ్లి నిలకడగా విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడటం చూడలేదు’’
- సెహ్వాగ్‌
- ఈనాడు క్రీడావిభాగం

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.