రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట!

బోలార్డ్స్‌, రంబుల్‌ స్ట్రిప్స్‌ ద్వారా వాహనాల వేగం తగ్గింపు
గతంతో పోలిస్తే జాతీయ, రాష్ట్ర రహదారులపై తగ్గిన ప్రమాదాలు
సత్ఫలితాలిస్తున్న నల్గొండ జిల్లా పోలీసుల చర్యలు

ఈనాడు, నల్గొండ: రహదారి ప్రమాదాల నియంత్రణకు నల్గొండ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారితో పాటు రెండు రాజధానుల మధ్య ప్రధాన అనుసంధాన మార్గాలుగా ఉన్న నార్కట్‌పల్లి-అద్దంకి, హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రహదారులు నల్గొండ జిల్లా నుంచే ప్రయాణించడంతో ఇక్కడ రహదారుల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. గతేడాది ఆగస్టులో మరణించిన సినీనటుడు హరికృష్ణతో పాటు అనేక మంది మరణాలకు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి కారణమైంది. దీంతో ఈ రహదారుల్లో ప్రమాదాల నియంత్రణకు పోలీసులు వినూత్న ఆలోచనతో సాగుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎక్కడిపడితే అక్కడ వేగ నిరోధకాలు (స్పీడ్‌ బ్రేకర్లు) వేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో ప్రధాన కూడళ్లు, నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాల (బ్లాక్‌స్పాట్స్‌) వద్ద బోలార్డ్స్‌, రంబుల్‌స్ట్రిప్స్‌ (ప్లాస్టిక్‌తో రహదారిపై జిగ్‌జాగ్‌గా అమర్చుతారు. వాహనాలు వీటిని ఢీకొట్టినా వంగి యథావిధిగా తమ స్థానానికే వస్తాయి), వైట్‌ బంప్స్‌ (జాతీయ రహదారిపై గతుకులతో కూడిన వైట్‌ పెయింట్‌)తో వాహనాల వేగాన్ని తగ్గించారు. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై నల్గొండ జిల్లా పరిధిలోని 92 కి.మీ.మార్గంలో 15 చోట్ల ఇలాంటివి ఏర్పాటు చేశారు. పోలీసులు ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రయోగాత్మకంగా ఈ చర్యలు చేపట్టడంతో అంతకుముందు మూడు నెలలతో పోలిస్తే ప్రమాదాలు తగ్గడమే కాకుండా మరణాలు నమోదు కాలేదు. హైదరాబాద్‌-సాగర్‌ రహదారిలోనూ నిత్యం ప్రమాదాలు జరిగే 6 ప్రాంతాల్లో ఇలాంటి చర్యల ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైనా నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని గోపులాయగుట్ట వద్ద వైట్‌ బంప్స్‌ వేయడంతో ఇక్కడ సైతం గతంతో పోలిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.

త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో
ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తొలి దశలో ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ఈ చర్యలను అమలు చేస్తున్నాం. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ఈ చర్యలను అమలు చేసి ప్రమాదరహిత జిల్లాగా చేయడానికి కృషి చేస్తున్నాం.
- ఏవీ రంగనాథ్‌, ఎస్పీ, నల్గొండ జిల్లా

 

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి [06:50]

మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని సంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి చెందారు. కల్హేర్‌ మండలం మార్డి తండాకు చెందిన తారావత్‌ బాబునాయక్‌ (39) అల్లిఖాన్‌పల్లి తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్‌తో కలిసి బుధవారం సాయంత్రం పిట్లం వెళ్లారు.

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.