బడి వదిలి... పొలానికి కదిలి..

కూలీలను పెట్టుకునే స్థోమత లేక సొంత పిల్లలను పనికి పంపుతున్న రైతులు
జోగులాంబ గద్వాల జిల్లా పాఠశాలల్లో పడిపోతున్న హాజరుశాతం
ఈనాడు డిజిటల్‌, గద్వాల

కూలీలను పెట్టుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించదు. సాగు చేయకుంటే అప్పు తీరదు. ఎటూ పాలుపోని స్థితిలో రైతన్న పిల్లలను బడి మాన్పించి పొలాల్లో పనులకు పంపుతున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి సాగుచేస్తున్న కుటుంబాల దయనీయ గాథ ఇది. జిల్లాలో 49,157 ఎకరాల్లో విత్తనపత్తి సాగు చేస్తున్నారు. తెలంగాణలో విత్తనపత్తిని ఈ ఒక్క జిల్లాలోనే సాగు చేస్తారు. దేశంలోనే 25 శాతం విత్తనపత్తి గద్వాల జిల్లాలో సాగవుతోంది. గద్వాల కేంద్రంగా ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకొన్న పది ప్రముఖ కంపెనీలు వారి ద్వారా విత్తనపత్తి వ్యాపారం చేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతుల అవసరాలను ఆసరా చేసుకొని వడ్డీలకు రూ.లక్షల్లో రుణాలిస్తూ విత్తనపత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు.

36 శాతం బడికి దూరం
జోగులాంబ గద్వాల జిల్లాలోని 458 ప్రభుత్వ పాఠశాలల్లో 73,381 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో విత్తనపత్తి సాగు పనులకు ప్రధానంగా తక్కువ కమతాలున్న కుటుంబాలు తమ పిల్లలను బడికి పంపకుండా పొలాలకు తీసుకెళ్తున్నాయి. గత ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో జిల్లా పాఠశాలల్లో 74 శాతం మాత్రమే సగటు హాజరు నమోదయ్యింది. మిగతా 26 శాతం విద్యార్థులు విత్తనపత్తి సాగుకే వెళ్లారు. పొలం పనులు ముగిసిన తర్వాత కూడా జిన్నింగు మిల్లుల్లో విత్తనాలు ఏరడానికి వెళ్తున్నారు.


ది జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ఉప్పేరులోని ఉన్నతపాఠశాల. ఇక్కడ  614 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ఆగస్టు నెలలో 416 మంది మాత్రమే తరగతులకు హాజరయ్యారు. సెప్టెంబరులో 345 మందే బడి మెట్లు ఎక్కారు. అక్టోబరులో హాజరుశాతం సగానికిపైగా పడిపోయింది. విద్యార్థులు పాఠశాలకు హాజరుకాకపోవడానికి ప్రధాన కారణం విత్తనపత్తి సాగేనని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పొలాలకు వెళ్లి నచ్చజెప్పినా పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆయన చెప్పారు.


త్తిపొలంలో పనిచేస్తున్న వీరిద్దరూ సోదరులు. ఒకరు ధరూరు మండలం గూడెందొడ్డి పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా.. మరొకరు గద్వాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రులతో కలిసి విత్తనపత్తిలో మొగ్గలు ఏరుతున్నారు. రూ.25 వేలకు కౌలుకు తీసుకొని విత్తనపత్తి సాగు చేస్తున్నానని, ఆర్గనైజరు దగ్గర రూ.3 లక్షలు అప్పు తెచ్చానని రైతు పెద్ద కృష్ణన్న తెలిపారు. కూలీలను పెట్టుకుంటే ఒక్కొక్కరికి రోజుకు రూ.350 ఇవ్వాలని, అంతటి స్థోమత తనకు లేదన్నారు. ఈ కుటుంబం మొత్తం విత్తనపత్తి పొలంలోనే మూడు నెలలుగా పనిచేస్తోంది.

సాగు ఖర్చు తగ్గించుకోడానికే
దేశంలో విత్తనపత్తి సాగులో 1.50 లక్షల మంది చిన్నారులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో 15 వేల మంది ఈ పనులు చేస్తున్నారు. ఇందులో 60 శాతం సొంత పొలాల్లో పనిచేస్తుండగా.. 40 శాతం కూలీలుగా వెళ్తున్నారు. గత మూడేళ్లుగా సాగు ఖర్చులు పెరిగాయి. విత్తన కంపెనీలు మాత్రం పాత ధరలకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. సాగు ఖర్చు తగ్గించుకోడానికి రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను పొలాల్లోకి తీసుకెళ్తున్నట్లు మేమూ చేసిన పరిశోధనలో వెల్లడైంది.

- డా।। దావులూరి వెంకటేశ్వర్లు, గ్లోకల్‌ పరిశోధన సంస్థ

 

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.