అనాథగా బాసర ఆర్‌జీయూకేటీ

  కులపతి లేరు.. సంచాలకుడు అసలే లేరు
  రెండేళ్లుగా ఐఏఎస్‌ అధికారే ఇన్‌ఛార్జి ఉపకులపతి
  హైదరాబాద్‌ నుంచే ఆయన పర్యవేక్షణ
 వర్సిటీ చట్టం మార్చనంత వరకు ఉపకులపతి నియామకం ఉండదు
  కరవైన పర్యవేక్షణ.. అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యం
ఈనాడు, హైదరాబాద్‌

రాజీవ్‌గాంధీ సాంకేతికత, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ).. వేలాది విద్యార్థులకు బంగరు భవితను అందించాల్సిన ప్రాంగణం.. గ్రామీణ విద్యార్థులను సైతం సాంకేతికతలో తీర్చిదిద్దేందుకు దశాబ్ది క్రితం బాసరలో ఏర్పాటుచేసిన ఈ విశ్వవిద్యాలయం నేడు అనాథలా మారింది. ఇన్‌ఛార్జి అధికారులు, తాత్కాలిక సిబ్బందితో పొద్దుపుచ్చుతూ ఈ విద్యాసంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయిదేళ్లుగా వర్సిటీకి శాశ్వత ఉపకులపతి లేరు. రెండేళ్ల నుంచి ఐఏఎస్‌ అధికారి అశోక్‌ వీసీగా వ్యవహరిస్తున్నారు. నెల క్రితం వరకు ఆయన ఇంటర్‌బోర్డు కార్యదర్శిగానూ ఉండగా, ఇప్పుడు కేవలం ఆర్‌జీయూకేటీకి ఇన్‌ఛార్జి ఉపకులపతిగా మాత్రమే ఉన్నారు. అయినా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యాప్రమాణాలు దిగజారవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అయిదేళ్లుగా ఇదీ దుస్థితి...

వర్సిటీలకు గవర్నర్‌ కులపతి(ఛాన్స్‌లర్‌)గా ఉంటే... ఆర్‌జేయూకేటీ పరిధిలోని మూడు ప్రాంగణాలకు కులపతిగా ఆచార్య రాజిరెడ్డి ఉండేవారు. పీహెచ్‌డీ ఉన్న విద్యావేత్త కులపతిగా ఉండాలన్నది ఈ విద్యాసంస్థ చట్టం ప్రత్యేకత. రాష్ట్ర విభజన తర్వాత బాసర ప్రాంగణానికి కులపతి లేని పరిస్థితి తలెత్తింది. ఉపకులపతి(వీసీ)ని నియమించాల్సింది ఆయనే. కులపతి లేకపోవడంతో అయిదేళ్లుగా ఇన్‌ఛార్జులే పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఓయూ మాజీ ఉపకులపతి సత్యనారాయణ సంచాలకుడిగా, ఇన్‌ఛార్జి వీసీగా పనిచేశారు. 2017 సెప్టెంబరు నుంచి అశోక్‌(అప్పట్లో ఇంటర్‌బోర్డు కార్యదర్శి)ను ఇన్‌ఛార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌ నుంచి ఆయన అప్పుడప్పుడు వెళ్లివచ్చేవారు. ఇప్పుడు ఆయన కేవలం ఇన్‌ఛార్జిగానే ఉన్నారు. అయినా హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగా ప్రాంగణంలోని అధికారులు, సిబ్బందిదే ఇష్టారాజ్యంగా మారింది. ఇటీవలే లైంగిక వేధింపుల ఆరోపణలతో ఒక అధ్యాపకుడిని తొలగించారు. పర్యవేక్షణ అధికారులుంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని ప్రాంగణంలోని డీన్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.
* ‘ఒక్క ప్రాంగణానికి కులపతి ఎందుకులే’ అన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బాసర ఆర్‌జీయూకేటీకి సైతం మిగిలిన వర్సిటీల మాదిరిగా గవర్నర్‌ను కులపతిగా నియమించాలంటే చట్టంలో మార్పు చేయాలి. శాసనసభ ద్వారా అది జరగాలి. విశ్వవిద్యాలయ చట్టాల పునఃసమీక్షపై ఏడాది క్రితం కమిటీని నియమించినా ఇప్పటివరకు నివేదిక రాలేదు.
* విద్యా వ్యవహారాల పర్యవేక్షణకు ఆచార్యుడిని సంచాలకుడిగా నియమించాలి. రెండేళ్ల నుంచి ఆ కొలువును భర్తీ చేయలేదు. చట్టంలో రిజిస్ట్రార్‌ పోస్టు లేకున్నా పాలనా వ్యవహారాల కోసం పాలకమండలి అనుమతితో నియమించుకోవచ్చు. అదీ లేదు. ఇక పరిపాలనాధికారి(ఏవో) ఉన్నా ఆయనకు చెక్‌ పవర్‌ లేదు. ఫలితంగా చిన్న పనులకూ ఇన్‌ఛార్జి వీసీ వద్దకు వెళ్లాల్సి వస్తోంది.
* విద్యాసంస్థలో 250కి పైగా బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నా వారిలో 90 శాతానికిపైగా కాంట్రాక్టు, పొరుగు సేవల వారే. అయిదేళ్లలో కనీసం ఒక్కరినీ శాశ్వత ప్రాతిపదికన నియమించలేదు.
* విద్యాసంస్థకు గవర్నింగ్‌ కౌన్సిల్‌ మనుగడలో లేదు. పాలకమండలి(ఈసీ) ఉన్నా అందులో ఉన్నది ఐఏఎస్‌ అధికారులే. ఫలితంగా ఏకంగా 7000 మంది విద్యార్థులుండే ఈ విద్యాసంస్థపై విద్యాశాఖ నిర్లక్ష్యం చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వనపర్తిలో మరో ప్రాంగణాన్ని నెలకొల్పి, ఆర్‌జీయూకేటీని మరింత బలోపేతం చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.