ఆధ్యాత్మికతతో మనస్సుకు సంతృప్తి

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక శక్తితోనే మనస్సుకు సంతృప్తి లభిస్తుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలమన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక శక్తిని పెంపొందించుకోవచ్చన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌లో ‘హోప్‌-హ్యాపీనెస్‌-హార్మోని’ పేరిట మహిళల కోసం రూపొందించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. చెడు ఆలోచనలను దూరం చేస్తూ మనిషి ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీ మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌ బి.కె.చక్రాధరి దీదీ, బాలీవుడ్‌ నటి గ్రేసీసింగ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్‌, మౌంట్‌ ఎవరెస్ట్‌ను ఎక్కిన మొదటి దివ్యాంగురాలు అరుణిమ సిన్హా, అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలు రమాదేవి, విశ్రాంత విజిలెన్స్‌ కమిషనర్‌ రంజనా కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సాహస రాణి

జుట్టుతో బస్సులు, ట్రక్కులు లాగి రికార్డులు సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బ్రహ్మకుమారి రాణి రైక్వర్‌ శుక్రవారం శాంతిసరోవర్‌లో మరోసారి తన సాహసాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. దాదాపు 6 టన్నుల బరువున్న బస్సును అవలీలగా తన జుట్టుతో లాగి అదుర్స్‌ అనిపించారు.

మరిన్ని