సోనియా, రాహుల్‌, ప్రియాంకలకు ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌, కుమార్తె ప్రియాంకలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత దళ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు- ఎస్‌పీజీ) రక్షణను ఉపసంహరించింది. వారికి ఇకపై సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలోని ‘జడ్‌ ప్లస్‌’ భద్రతను కల్పిస్తామని శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి.

ఎస్‌పీజీ ఎందుకు?
ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధాని రక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్‌పీజీ ఏర్పాటయింది. 1985 మార్చి 30న 819 మంది సిబ్బందితో ఎస్‌పీజీని కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ ఆధీనంలో ఏర్పాటుచేశారు. 1985 ఏప్రిల్‌ 8 నుంచి అది విధి నిర్వహణ మొదలుపెట్టింది. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఈ భద్రతా బృందాన్ని ఏర్పాటు చేశారు. వీపీసింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్‌కు ఎస్‌పీజీ భద్రతను తొలగించింది. 1991 మేలో రాజీవ్‌ హత్యకు గురయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991లో ఎస్‌పీజీ చట్టానికి సవరణ చేసింది. మాజీ ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకూ పదేళ్ల వరకూ ఎస్‌పీజీ భద్రత కల్పించేలా ఉత్తర్వులు జారీఅయ్యాయి. వీవీఐపీల జాబితాను సవరించి గత 28 ఏళ్లుగా సోనియా కుటుంబ సభ్యులకు ఎస్‌పీజీ కమాండోల రక్షణ కల్పిస్తున్నారు. గత ఆగస్టు నెలలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించిన కేంద్రం తాజాగా ఆ నిర్ణయాన్ని సోనియా కుటుంబ సభ్యులకు వర్తింపజేసింది. భద్రత వ్యవహారాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దేశంలో ప్రధాని మోదీ తర్వాత సోనియా, రాహుల్‌, ప్రియాంకలకు మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉండేది. ఇప్పుడు అది ప్రధానమంత్రికి మాత్రమే పరిమితం కానుంది.

కాంగ్రెస్‌ ఖండన
సోనియా కుటుంబ సభ్యులకు ఎస్‌పీజీ భద్రత ఉపసంహరించడాన్ని కాంగ్రెస్‌ ఖండించింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికే భాజపా ఇలాంటి విధానాలను అమలు చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోపించారు. ఉగ్రవాదానికి బలయిన ఇద్దరు మాజీ ప్రధానుల కుటుంబాల జీవితాలను ముప్పులోకి నెడుతోందని విమర్శించారు.


మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.