మలుపులు తిప్పిన వ్యాజ్యాలు

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం ఈ నాటిది కాదు. ఏడు దశాబ్దాల కాలంలో ఇది అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. వివిధ పక్షాలు వ్యాజ్యాలు వేశాయి. వాటిపై తీర్పులు వచ్చిన ప్రతిసారీ సంచలనమే. న్యాయస్థానాల్లో దాఖలైన కేసుల్లో కొన్ని ప్రధానమైనవి...

* 1885: బాబ్రీ మసీదు ప్రాంగణంలోని రామ్‌ఛబుత్ర ప్రాంతంలో రామ మందిరం నిర్మాణానికి అనుమతి కోరుతూ మహంత్‌ రఘువర్‌దాస్‌ 1885 సంవత్సరంలో ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు. ప్రతిగా మసీదు ముతావలి సైతం మరో కేసు వేశారు. కోర్టు కొట్టేసింది.

* 1949 డిసెంబరు: బాబ్రీ మసీదులో రాముడు, సీతాదేవి విగ్రహాల్ని ప్రతిష్ఠించారంటూ పోలీసు కేసు నమోదు. ఆ ప్రాంగణాన్ని సీజ్‌ చేయించి, తాళాలు వేయించిన ఫైజాబాద్‌ జిల్లా మెజిస్ట్రేటు. ఆ ప్రాంగణాన్ని తెరిచి, పూజలకు అవకాశం కల్పించాలంటూ 1950 జనవరిలో ఫైజాబాద్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గోపాల్‌సింగ్‌ విశారద్‌, రామచంద్రదాస్‌ పరమహంస.

* 1961 ఫిబ్రవరి: బాబ్రీ మసీదు తమ ఆస్తి అని, దీనిపై హిందువులు వేసిన మూడు వ్యాజ్యాలను కొట్టివేయాలని సవాల్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు.
* 1986 ఫిబ్రవరి: బాబ్రీ మసీదును తెరిచి, హిందువులు పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఫైజాబాద్‌ జిల్లా న్యాయమూర్తి ఆదేశం. అదే ఏడాది ‘బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ’ ఏర్పాటు.
* 1989: బాబ్రీ మసీదు-రామజన్మభూమి సంబంధిత కేసులన్నీ యూపీ హైకోర్టుకు బదలాయింపు.
* 1992 డిసెంబరు 6: బాబ్రీమసీదును కూల్చేసిన కరసేవకులు.

* 1992 డిసెంబరు 12: ఘటనపై విచారణకు జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌ నియామకం.

* 1993: కమిషన్‌ విచారణ ప్రారంభం. దస్త్రా   లను స్వాధీనం చేసుకున్న సీబీఐ. అయోధ్యకు రథయాత్ర నిర్వహించిన భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, మరో 19 మందిపై కేసులు నమోదు. మసీదు కూల్చివేసేలా కరసేవకుల్ని వారు రెచ్చగొట్టారంటూ అభియోగం నమోదు. వివిధ అంశాలను సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టులో కేసుల దాఖలు.

* 2001 మే: నేరపూరిత కుట్ర అభియోగాల నుంచి ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషిలకు ఉపశమనం కలిగించిన ప్రత్యేక న్యాయస్థానం.

* 2002 ఏప్రిల్‌: అయోధ్య స్థల యాజమాన్యంపై విచారణ ప్రారంభించిన అలహాబాద్‌ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం
* 2003: మసీదు కింద ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు బయటపెట్టిన భారత పురాతత్వ పరిశోధన సంస్థ(ఏఎస్‌ఐ). విభేదించిన ముస్లిం సంస్థలు.

* 2009 జూన్‌: నివేదిక సమర్పించిన లిబర్‌హాన్‌ కమిషన్‌. బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యులుగా 68 మంది గుర్తింపు.

* 2010 సెప్టెంబరు 30: వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి రెండు భాగాలను హిందువులకు, ఒక భాగాన్ని ముస్లింలకు పంచాలంటూ చరిత్రాత్మక తీర్పు వెలువరించిన అలహాబాద్‌ హైకోర్టు. దీనిని సవాల్‌చేస్తూ ఆ తర్వాత సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలు.
* 2011 మే: అలహాబాద్‌ హైకోర్టు తీర్పును నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు. వివాదాస్పద స్థలంపై స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ.
* 2016 ఫిబ్రవరి: స్థల యాజమాన్యాన్ని తేల్చడానికి అత్యవసర విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టును కోరిన భాజపా నేత సుబ్రమణ్యస్వామి.
* 21.3.2017: అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని న్యాయస్థానం వెలుపల సాధించుకోవాలని సూచించిన త్రిసభ్య ధర్మాసనం. దీనికి మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధత.
* 19.4.2017: నిందితులపై 1992లో నమోదైన కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలంటూ సీబీఐ న్యాయస్థానానికి సుప్రీం ఆదేశం. రోజువారీ విచారణ ప్రారంభించాలని, 2019 నాటికి కేసును కొలిక్కి తీసుకురావాలని స్పష్టీకరణ.

* 26.5.2017: అభియోగాల నమోదు నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలంటూ భాజపా నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌జోషి, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంభర, విష్ణుహరి దాల్మియాలకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశం. ఆ తర్వాత అదనపు అభియోగాలు నమోదు.

* 5.12.2017: వివాదంపై సుప్రీంకోర్టులో మొదలైన విచారణ.
* 8.1.2019: స్థల వివాదం కేసులో వాదనలు ఆలకించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు. సభ్యులుగా జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌.
* 25.1.19: ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పునర్వ్యవస్థీకరణ. కొత్త ధర్మాసనంలో జస్టిస్‌ గొగొయితోపాటు జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌.
* 8.3.19: మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌.ఎం.ఐ.ఖలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు.

* 10.5.19: సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ బృందం తుది నివేదిక.

* 6.8.19: రోజువారీ ప్రాతిపదికన ప్రారంభమైన విచారణ.
* 16.9.19: అత్యున్నత న్యాయస్థానంలో ముగిసిన విచారణ.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.