సుప్రీంలో కక్షిదారుల వాదనలివీ

అయోధ్యపై వైఖరిని వినిపించిన పిటిషనర్లు
  లిఖిత పూర్వకంగానూ అభిప్రాయాల అందజేత
ఈనాడు, ప్రత్యేక విభాగం

అయోధ్యలోని ‘రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాద కేసు’లో... తాము మొదటి నుంచీ వినిపిస్తున్న వాదనలకే కక్షిదారులు చివరి వరకూ కట్టుబడి ఉన్నారు. ఈ వివాదాస్పద భూమిని మూడు సమాన భాగాలుగా చేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీం సీజే జస్టిస్‌ రంజన్‌ గొగొయి అధ్యక్షతన ఏర్పాటైన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 40 రోజులపాటు విచారణ చేపట్టింది. తర్వాత లిఖితపూర్వకంగానూ కక్షిదారుల నుంచి అభిప్రాయాలు కోరింది.

రాంలల్లా విరాజ్‌మాన్‌

మొత్తం వివాదాస్పద ప్రాంతాన్ని రాంలల్లాకు మాత్రమే కేటాయించాలి.
* వివాదాస్పద ప్రాంతంలోని ఏభాగాన్నీ నిర్మోహి అఖాడాకు గానీ, ముస్లిం కక్షిదారులకు గానీ కేటాయించకూడదు.

రామజన్మ భూమి పునరుద్ధరణ సమితి

వివాదాస్పద ప్రాంతంలో రామమందిర నిర్మాణానికి మాత్రమే అనుమతివ్వాలి.ఆలయం నిర్మించిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతలను చూసుకోవడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలి.

నిర్మొహి అఖాడా

ఒకవేళ తీర్పు హిందూ కక్షిదారులకు అనుకూలంగా వస్తే... ప్రతిపాదిత రామ మందిరంలో పూజా కైంకర్యాల హక్కు మాకే ఇవ్వాలి.
* రామమందిర నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. నిర్మాణం తర్వాత ఆలయ నిర్వహణ హక్కులనుమాకే అప్పగించాలి.
* అలహాబాద్‌ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే వివాదాస్పద స్థలంలో ముస్లింలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అక్కడ వారికి లభించే స్థలాన్ని రామ మందిరాన్ని నిర్మించుకునే నిమిత్తం హిందువులకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేలా ఆదేశించాలి.
* వివాదాస్పద ఆవరణకు వెలుపల మసీదు నిర్మాణం నిమిత్తం ముస్లింలకు భూమిని సమకూర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి.

సీల్డ్‌ కవర్‌పై అభ్యంతరాలు

ముస్లిం పార్టీలు తమ అభిప్రాయాలను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. కోర్టు తీర్పునిచ్చే సమయంలో ఈ గొప్ప దేశానికున్న రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు. సీల్డ్‌కవర్‌లో వాదనలు సమర్పించడం పట్ల హిందూ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేసు విచారణ చివరిరోజు... వివాదాస్పద స్థలంపై హక్కులు వదులుకోవడం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ అంగీకరించినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అయితే ముస్లిం పార్టీలు వాటిని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన వెలువరించాయి.

అఖిల భారత హిందూ మహాసభ

డిక్రీ ఇవ్వబోయే ఆస్తిపై మాకు పూర్తి పాలనాధికారాలు కల్పించాలి.
వివాదాస్పద ప్రాంతంలో నిర్మించనున్న రామాలయ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలి.
సదరు ట్రస్టుకు న్యాయస్థానమే ఒక అధికారిని నియమించాలి.

సున్నీ వక్ఫ్‌బోర్డు

అయోధ్యలోనిది బాబ్రీమసీదు స్థలమే. 1992, డిసెంబరు 6 నాటికి బాబ్రీ మసీదు ఎలా ఉండేదో అలాగే కొత్త మసీదును పునర్నిర్మించాలి.

షియా వక్ఫ్‌ బోర్డు

* ముస్లిం పక్షాలు వివాదాస్పద ప్రాంతంపై హక్కులు కోరవద్దు.
* అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామాలయం నిర్మించాలి.
* సంబంధిత స్థలానికి మేమే హక్కుదారులం.
* అలహాబాద్‌ హైకోర్టు తీర్పులో సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇచ్చిన భూమిని హిందూ కక్షిదారులకే కేటాయించాలి.

గోపాల్‌సింగ్‌ విశారద్‌

మసీదు నిర్మాణానికి ముందు నుంచే అక్కడున్న ఆలయంలో మా వంశస్థులు తరతరాలుగా పూజలు చేస్తూవచ్చారు. కొత్తగా నిర్మించే రామాలయంలో పూజలుచేసే రాజ్యాంగ హక్కు మాకే ఉంటుంది. కేసులో ఎలాంటి రాజీ ప్రయత్నాలకు తావుండొద్దు.

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.