అత్యుత్తమ నేత నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నేత. ప్రపంచ ఉత్తమ నాయకుల్లో ఒకరు.. మోదీ ఎలా ఆలోచిస్తారు..ఏమి ఆలోచిస్తారు అన్నది తెలుసుకొనేందుకు  ఇటీవల నాకు అవకాశం లభించింది. మోదీ దేశంలోని ధనికులకో లేదా పేదలకో ప్రాతినిధ్యం వహించడం లేదు. ఆయన అన్ని వర్గాల వ్యక్తి.  ఎన్నో అద్భుతాలు సాధించారు. ప్రజల పురోగతి కోసం భారీ ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తున్నారు. 50కోట్ల శౌచాలయాలు నిర్మించారు. ప్రజలకు నీటి వసతి కల్పిస్తున్నారు. ధ్యానానికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు.

రే డేలియో, అమెరికా కుబేరుడు
(ఇటీవల సౌదీలో పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన ప్రధాని మోదీతో కలిసి ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రభావితమై ఈ ట్వీట్‌ చేశారు.)

ఈ ఖ్యాతి ప్రజలకే దక్కుతుంది
అనేక మంది భారతీయులు.. ప్రత్యేకించి మహిళల సాధికారికత కోసం మా హయాంలో జరిగిన కృషి ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ ఖ్యాతి కూడా ప్రజలకే దక్కుతుంది. మార్పు కోసం అన్ని వర్గాల ప్రజలూ సహకరించారు. దశాబ్దాల పాటు చూడని విధంగా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు. ధ్యానం మన ఆలోచనలు, జీవనశైలిలో సమతుల్యత సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతరులను తక్కువగా చూసే వైఖరి ఘర్షణలకు తావిస్తుంది. వాస్తవంగా ఆలోచించడం ద్వారా వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఏక ధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచంగా మారుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న దేశాల పాత్ర కూడా కీలకంగా మారుతుంది.

- ప్రధాని మోదీ ప్రతిస్పందన

మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.