తెరాసకు బాసులు గల్లీల్లో ఉన్నారు

విపక్షాల తప్పుడు ప్రచారంతో  ప్రభుత్వానికి దిష్టిపోతుంది
మంత్రి కె.తారకరామారావు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంతో పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న దిష్టిపోతుంది తప్ప.. వారికి ఒరిగేదేమీ లేదన్నారు. ‘తెరాస పార్టీకి బాసులు దిల్లీలో లేరు. తెలంగాణ గల్లీల్లో ఉన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి పేద ప్రజల అభిమానం.. దీవెనలు ఉన్నన్ని రోజులు ఎవరూ ఏమీ చేయలేరు’ అని పేర్కొన్నారు. ప్రజలు అడిగితే అభివృద్ధి చేసే ప్రభుత్వాలను గతంలో చాలా చూశామని, అడగకుండానే ప్రజల అవసరాలను గుర్తించి.. ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తున్న సర్కారు తమదని వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో రూ.5.77 కోట్లతో 2500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల రెండు శీతల గిడ్డంగుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ గిడ్డంగుల నిర్మాణాలు వచ్చే జూన్‌కి పూర్తవుతాయని, వీటిలో నిల్వ చేసే పండ్లు, కూరగాయలను ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని ఆహారశుద్ధి కేంద్రానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ అరుణ, సెస్‌ ఛైర్మన్‌ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల నినాదాలు.. స్టేషన్‌కు తరలింపు
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో భోజన విరామ సమయంలో పలువురు ఆర్టీసీ కార్మికులు మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మికులు నినాదాలు చేయడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


మరిన్ని

విడాకులు తీసుకున్న ప్రముఖ హీరో [00:57]

21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌. పరస్పర అంగీకారంతో అర్జున్‌ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు...

అది నిజం కాదు..ఇది అసలైన ఫొటో.. [00:53]

రైళ్లలో పాటలు పాడుకుంటూ యాచన చేసే రాణు మండల్‌ ఓ ప్రయాణికుడు ఆమె పాటను యూట్యూబ్‌లో పెట్టడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ

వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే [01:01]

వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపిక పూర్తైంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ కూడా వన్డే జట్టులో స్థానం

తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు [06:21]

ఆర్టీసీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు [03:34]

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు

కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు [02:00]

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఓహెచ్‌ఈ (ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌)తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్‌ వెళ్లే కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గురువారం రాత్రి...

సియాచిన్‌పై నోరు పారేసుకున్న పాక్‌.. [01:04]

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సియాచిన్‌ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శనలను చేపట్టవద్దని పాకిస్థాన్ పేర్కొంది.

భారతీయులపై ఉగ్ర ముద్ర వేసేందుకు కుట్ర [01:04]

ఐరాస భద్రతా మండలితో భారతీయులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయించేందుకు పాకిస్థాన్‌ కుట్ర పన్నుతోంది. జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ

మమత మంత్రులకు గవర్నర్‌ కౌంటర్‌ [01:04]

తాను చేసే వ్యాఖ్యలపై కాకుండా తమ శాఖలపై దృష్టి సారించాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ సింగ్‌ ధన్కర్‌ ఆ రాష్ట్ర మంత్రులకు సూచించారు. కొన్నిరోజులుగా మమత........

పీవోకే వ్యక్తిని వదిలిపెట్టిన భారత సైన్యం [01:04]

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చిన ఓ వ్యక్తిని భారత సైన్యం గురువారం మానవతా దృక్పథంతో వదిలిపెట్టింది. ఇటీవల అతడిని వదిలేయాలంటూ పీఓకే అధికారులు భారత సైన్యాన్ని సంప్రదించగా వారు అంగీకరించారు.