నోట్ల రద్దు ‘తుగ్లక్‌ తప్పిదం’

సోనియా గాంధీ ధ్వజం

ఈనాడు, దిల్లీ: ప్రధాని మోదీ మూడేళ్ల క్రితం (2016 నవంబరు 8న) ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం ‘తుగ్లక్‌ తప్పిదం’గా నిలిచిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. ఎంతో మందికి ఉపాధి లేకుండా చేసిన ఈ నిర్ణయాన్ని దేశం మరచిపోదు, ఎన్నడూ క్షమించదని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటన విడుదల చేశారు. పెద్దనోట్ల రద్దు ద్వారా నాడు మోదీ ప్రకటించిన లక్ష్యాల్లో ఒక్కటీ నిజంకాలేదని ఆరోపించారు. నోట్ల రద్దు అనంతరం ప్రతి ఏటా జీడీపీ పడిపోతోందని, డిజిటల్‌ లావాదేవీలు పెరగకపోగా నగదు చలామణి పెరిగిందని, రద్దయిన నోట్లలో తిరిగి అధిక శాతం బ్యాంకులకు చేరడంతో నల్లధనాన్ని అరికట్టలేకపోయారని సోనియా తెలిపారు. నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఉగ్రదాడిలాంటిదని రాహుల్‌ పేర్కొన్నారు. దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేసిందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

మరిన్ని