వైకాపా ఎన్నికల వ్యయం రూ.85.65 కోట్లు

తెదేపా ఖర్చు రూ.77.74 కోట్లు
సీఈసీకి పార్టీల నివేదికలు

ఈనాడు, దిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైకాపా, తెదేపా కలిసి మొత్తం రూ.163.40 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాయి. ఎన్నికలకు వెళ్లేనాటికి తమ వద్ద ఉన్న నిధులు, ఎన్నికలు పూర్తయ్యే నాటికి సమకూర్చుకున్న సొమ్ము.. ఎన్నికల వ్యయం పోగా ప్రస్తుతమున్న నిధులు వివరాలను అందజేశాయి. ఎన్నికల్లో రూ.85.65 కోట్లు వ్యయం చేసినట్లు వైకాపా, రూ.77.74 కోట్లు ఖర్చు చేసినట్లు తెదేపా చూపాయి. అభ్యర్థుల నేర చరిత్ర ప్రచారానికి సంబంధించిన వ్యయాన్ని ఈ పార్టీలు వేరుగా చూపించాయి.


మరిన్ని