అదిగో ఆదివాసీ డోలు

ఆదివాసీ తెగల్లో పెళ్లిళ్లు, పేరంటాలు, సంప్రదాయ పండుగలు, జాతరల్లో డోలు వాయిద్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. వాటిని సొంతంగా తయారుచేసుకోవడమూ వారి ఆచారంలో భాగమే. కులదేవర జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం సుంగాపూర్‌ కొలాంగూడకు చెందిన ఆదివాసీ కొలాం తెగ వారు డోలు తయారీలో నిమగ్నమయ్యారు. సొంత ఆలోచనతో సైకిల్‌ వెనుక చక్రానికి, డోలు తయారీకి ఉపయోగించే పనస మొద్దుకూ తాడును అనుసంధానించారు. సైకిల్‌ తొక్కుతుంటే, మొద్దు గుండ్రంగా తిరిగేలా చేశారు. అది తిరుగుతుండగా, తయారీలో చెయ్యి తిరిగిన కుమ్ర ఖాను ఉలితో చెక్కుతూ మొద్దుకు డోలు ఆకారం తీసుకొస్తున్న చిత్రమిది. దీని తయారీకి ఆరు రోజుల సమయం పడుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌

మరిన్ని