ఏపీలో మిలటరీ పాలన

సీపీఐ నారాయణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: గ్రామానికి నాలుగువేల మంది పోలీసుల పహారాతో ఆంధ్రప్రదేశ్‌లో మిలటరీ పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని మోదీ సీఏఏ, ఎన్నార్సీల పేరుతో జనాన్ని మతం పేరుతో విడగొడుతున్నట్లే.. ఏపీ సీఎం జగన్‌ మూడు రాజధానుల పేరుతో జనాల్ని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేయలేమంటున్న జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కనీసం రూ.4 లక్షల కోట్లు కావాలన్నారు. హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు ఒకరినొకరు పొగుడుకోవడానికేనని ఎద్దేవా చేశారు.

మరిన్ని