వైకాపా హామీల్లో కొత్త‌వేమీ లేదు: య‌న‌మ‌ల‌ 

విజ‌య‌వాడ‌: తల్లి, పిల్ల కాంగ్రెస్ ల మధ్య రాజీ కుదిర్చేందుకే ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ పెట్టుకున్నారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక మంత్రి య‌నమల రామకృష్ణుడు విమర్శించారు.  ప్లీనరీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది నవరత్నాలు కాదు, 9 గులక రాళ్లని ధ్వజమెత్తారు. వైకాపా హామీల బడ్జెట్ పై చర్చ అనవసరం, అసందర్భమని వ్యాఖ్యానించారు. జనం భయపడేది వారి హామీల గురించి కాదని, వైకాపా విధ్వంసక ధోరణి గురించేనని విమ‌ర్శించారు. వైకాపా ప్ర‌క‌టించిన హామీలు కొత్త‌వి కాదని 2004, 2009, 2014లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలలోనివేనని  గుర్తుచేశారు. 

24లక్షల  మంది చిన్న రైతులకు 50వేల రూపాయలు ఒకే దఫాగా తాము చెల్లించామని..., ఏడాదికి 12,500 రూపాయల చొప్పున నాలుగేళ్లలో ఇస్తే రైతుకేం ఒరుతుంద‌ని యనమల ప్రశ్నించారు. దశలవారీ మద్యనిషేధం 2004లో చెప్పిందేన‌ని కొత్తదేమీ కాదన్నారు. 18% అపరాధ రుసుం చెల్లించిన ఒక్క రైతును చూపించమన్న సోమిరెడ్డి ఛాలెంజ్ కు వైకాపా ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్రశ్నించారు. బకాయిలన్నీ చెల్లించండి..., నాలుగేళ్లలో ఏడాదికింత చెల్లిస్తామన్న హామీ హాస్యాస్పదంగా ఉందని యనమల ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి హామీని ప్రజలు 2014 ఎన్నికల్లోనే తిరస్కరించారన్నారు. పీకేను రాహుల్ వాడుకున్నాడని..., తల్లి కాంగ్రెస్ భూస్థాపితం అయ్యింది.., ఇప్పుడు జగన్ తెచ్చుకున్నాడు, ఇక పిల్ల కాంగ్రెస్ కూడా భూస్థాపితమేనని అన్నారు. నియోజకవర్గాల పెంపును రాహుల్ వ్యతిరేకించడం మరో ద్రోహమని మండిప‌డ్డారు. అసమాన విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధికంగా,భౌగోళికంగా ఇప్పటికే రాహుల్ ద్రోహం చేశారని యనమల మండిపడ్డారు. నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించడం ద్వారా రాహుల్ రాజకీయ, సామాజిక ద్రోహానికి తెగబడ్డారన్నారు. 2019 ఎన్నికలతో రాష్ట్రానికి,దేశానికి పట్టిన చీడపీడలు పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ వదిలిపోతాయని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. 

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా [19:29]

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...