‘కథానాయకుడు’పై చంద్రబాబు ప్రశంసల జల్లు

బాలకృష్ణ, క్రిష్‌ను సత్కరించిన సీఎం

హైదరాబాద్‌: ‘యన్‌.టి.ఆర్‌- కథానాయకుడు’ చిత్ర బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. గురువారం రాత్రి బెంజిసర్కిల్‌లో ఉన్న ట్రెండ్‌ సెట్‌ మాల్‌లో కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో కలిసి చంద్రబాబు సినిమా చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు శుక్రవారం బాలయ్య, క్రిష్‌ను సత్కరించారు. బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రను అద్భుతంగా పోషించారని చంద్రబాబు అన్నారు. ‘యన్‌.టి.ఆర్‌’ సినిమాను తెరకెక్కించి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్ర రూపమిచ్చిన క్రిష్‌ను అభినందించారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ బయోపిక్‌లో బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్‌, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మేనన్, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌రాజ్‌పుత్‌ నటించారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందించారు. బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాను వారాహి చలన చిత్రం సంస్థ సమర్పించింది. బుధవారం విడుదలైన ఈ సినిమా సినీ విశ్లేషకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు! [21:31]

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు...

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో