మెకానిక్‌ చిన్నది...టాపర్‌గా!

శాస్త్రవేత్త కావాలని అనుకుంది... ఆర్థికంగా స్థోమత లేక ఆర్ట్స్‌లో చేరింది. మొదట్లో కష్టంగా చదివింది... ఆ తరువాత ఇష్టాన్ని పెంచుకుంది.  పుస్తకాలు కొనుక్కోవడానికి కనీసం డబ్బులు లేవు... కళాశాలకు వెళ్లడానికి సైకిల్‌ కూడా లేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు... దూరభారం లెక్కచేయకుండా నడుచుకుంటూ వెళ్లింది. కుటుంబ దుస్థితి చూసి టైర్లకు పంక్చర్‌ వేసింది. ఆమే కర్ణాటకకు చెందిన కుసుమ ఉజ్జని. ఇటీవల పీయూసీ ఆర్ట్స్‌ విభాగంలో ఆ రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించింది. అలాగే బసమ్మ అనే అంధురాలు తొంభైశాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ విశేషాలేంటో చదివేయండి మరి.

కుసుమ ఉజ్జని స్వస్థలం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని కొట్టూరు పట్టణం. తండ్రి దేవేంద్రప్ప, తల్లి జయమ్మలకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. వారికి సెంటు భూమి కూడా లేదు. బిడ్డలే వారి ఆస్తి. దేవేంద్రప్ప ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. కొన్ని రోజుల వరకు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. అప్పుడాయన లారీలపై ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. తరువాత ఆడపిల్లలు ఎదగడంతో ఇంటి దగ్గరే ఏదైనా పని చేసుకోవాలని టైర్‌ పంక్చర్‌ షాప్‌ ఏర్పాటు చేసుకున్నాడు. కష్టపడి పిల్లలందరినీ డిగ్రీ, ఆపై చదువులు కూడా చదివించాడు. ఆయన నాలుగో కూతురే కుసుమ ఉజ్జని. ఇటీవల పీయూసీ ఆర్ట్స్‌ విభాగంలో 600 మార్కులకు 594 మార్కులు సాధించి కర్ణాటక రాష్ట్ర టాపర్‌గా నిలిచింది.
* పుస్తకాలు కొనలేని దుస్థితి...
కుసుమ ఉజ్జని ప్రాథమిక స్థాయి నుంచే చదువులో రాణించేది. పదో తరగతిలో 96 శాతం మార్కులు తెచ్చుకుంది. ఆ తరువాత డిప్లొమో, విజ్ఞాన విభాగంలో చేరి శాస్త్రవేత్త కావాలనుకుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమని అక్కలు, బావలు నచ్చజెప్పి హిందూ పీయూసీ కళాశాలలోని ఆర్ట్స్‌ విభాగంలో చేర్పించారు. అక్కడ కన్నడ, సంస్కృతం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, శిక్షణ శాస్త్రం ఇష్టం లేకున్నా చదవాల్సి వచ్చేది. కొన్ని రోజులకు అక్క కరిబసమ్మ ‘మనం అనుకున్నది మనకు అప్పడప్పుడు దొరకదు. ఏది లభించిందో దాంట్లోనే మనమేంటో నిరూపించుకోవాలి’ అంటూ ప్రోత్సహించింది. అప్పటి నుంచే ఆర్ట్స్‌పై ఇష్టాన్ని పెంచుకుంది. మొదటి సంవత్సరం ఆమె తల్లిదండ్రులు అతి కష్టం మీద రూ.8 వేల ఫీజు కట్టారు. రెండో ఏడాది కూడా రూ.16 వేలు కట్టాల్సి రావడంతో పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేని దుస్థితి. దీంతో సీనియర్‌ విద్యార్థుల నుంచి వాటిని సమకూర్చుకుంది. ఇంటి నుంచి కళాశాల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సైకిల్‌ కొనుక్కునే స్థోమత లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లి వచ్చేది.

* టైర్లకు పంక్చర్‌ వేస్తూ...
కుసుమ టాపర్‌గా నిలవాలని ఏనాడూ గంటల తరబడి చదివేది కాదు. అధ్యాపకులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని నోట్స్‌ రాసుకునేది. తీరిక దొరికినప్పుడు గ్రంథాలయానికి వెళ్లి రాజనీతి శాస్త్రం, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివేది. రోజూ దినపత్రికను మాత్రం తప్పనిసరిగా చూసేది. ఆమె విన్నది కనీసం మూడు సార్లు చదువుకొని గుర్తుపెట్టుకునేది. దీంతో ఆమెకు ద్వితీయ పీయూసీ పరీక్షల్లో కన్నడ-96, సంస్కృతం-99, స్పెషల్‌ కన్నడ-100, చరిత్ర 100, రాజనీతి శాస్త్రం-100, శిక్షణ శాస్త్రం-100 మార్కులు వచ్చాయి. అలా రికార్డు సృష్టించింది. ఇంటికి వచ్చిన తరువాత నాన్న షాపునకు వెళ్లి టైర్లకు పంక్చర్‌ వేసేది. ఇప్పుడామె సులువుగా ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్‌, జీపు వంటి వాటి వాహనాల టైర్లకు పంక్చర్‌ వేయగలదు.
* లక్ష్యం సివిల్స్‌...
‘అమ్మానాన్న పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ వారి శక్తి సామర్థ్యాలకు మించి మమ్మల్ని చదివించారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. స్నేహితులు మంచి మంచి దుస్తులు, చెప్పులు, స్కూటీలు వేసుకొని వస్తున్నా మేం ఏనాడు దుబారా ఖర్చులకు వెళ్లలేదు. కనీసం సైకిల్‌ కూడా కొనుక్కోలేదు. దూరభారాన్ని లెక్కచేయకుండా కాలినడకనే పాఠశాల, కళాశాలలకు వెళ్లేవాళ్లం. ద్వితీయ పీయూసీలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు రావడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పరీక్షల కోసం నిద్రాహారాలు మాని చదవాల్సిన అవసరం లేదు. ప్రణాళికాబద్ధంగా చదివితే దైన్నైనా సాధించగలం. ఒక అక్క ఎం.కాం., మరో అక్క బి.ఈడీ చేయడంతో వాళ్లు చాలా సలహాలు ఇచ్చేవారు.  పరీక్షలు రాసిన తరువాత టాప్‌-10లో ర్యాంకు వస్తుందని భావించా. కానీ మొదటి ర్యాంకు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. మా నాన్న మా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. డిగ్రీ తరువాత సివిల్స్‌కు సన్నద్ధం అవుతా’ అని అంటుంది కుసుమ ఉజ్జని.

-పాలేటి తిమ్మప్ప చౌదరి, బళ్లారి, న్యూస్‌టుడే

 

అంధత్వాన్ని జయించి
కర్ణాటకలోని మాథాడ్‌కు చెందిన గురయ్య, రాజేశ్వరి దంపతులకు బసమ్మ మొదటి కూతురు. పుట్టుకతోనే అంధురాలు. సోమవారం విడుదలైన పీయూసీ ఫలితాల్లో బసమ్మ   90 శాతం మార్కులు సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ప్రతిభకు అంధత్వం అడ్డురాదని నిరూపించుకుంది. బనమ్మ మహేశ్వరి అంధుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. అక్కడ 625కు 597 మార్కులను సాధించి తనేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. తరువాత బెల్గావీ, ఆంజనేయ నగర్‌లో సాధారణ విద్యార్థులు చదువుకునే లింగరాజ్‌ కామర్స్‌ పీయూ కళాశాలలో పీయూసీలో చేరింది.  చదువును సవాలుగా తీసుకుని 80 మంది సాధారణ విద్యార్థులతో పోటీ పడింది. శ్రద్ధగా పాఠాలు వింటూ వారికంటే మేటీగా నిలిచింది. మొత్తం 600 మార్కులకు 540 సాధించి తన సత్తా చాటింది. అలాగని ప్రత్యేకంగా ట్యూషన్లకు కూడా వెళ్లలేదు. బసమ్మకు సంగీతం అన్నా ఇష్టమే. కేఎల్‌ఈ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో డిప్లొమో పూర్తి చేసింది.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....

కోడెల బాగోతాలు త్వరలోనే వెలుగులోకి [08:10]

హైదరాబాద్‌లో పాత అసెంబ్లీకి చెందిన 4 లారీల ఫర్నిచరును పట్టుకుపోయిన మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు.. ...