శ్రద్ధ కోసం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో మార్పులు?

హైదరాబాద్‌: బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ కోసం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో మార్పులు చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌, తారక్‌కు జోడీగా బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల డైసీ సినిమా నుంచి తప్పుకొన్నారు. 
ఆమె స్థానంలో శ్రద్ధను ఎంపికచేయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. శ్రద్ధ కోసం స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమాకు శ్రద్ధా కపూర్‌ డేట్స్‌ కుదరకపోతే.. పరిణీతి చోప్రాను ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం అనుకుంటోందట. అయితే.. ఈ సినిమాలో స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సంఘటనలను చూపించబోతున్నారు కాబట్టి.. తారక్‌కు జోడీగా బ్రిటిష్‌ నటినే ఎంపికచేసుకోవాల్సి ఉందట.
‘ఇప్పటికిప్పుడు డైసీకి బదులు మరో బ్రిటిష్‌ నటిని తీసుకురావడం కుదరదు. ఇందుకోసం క్యాస్టింగ్‌ ఏజెన్సీలతో మాట్లాడాలి. అదో పెద్ద ప్రక్రియ. అందుకే చిత్రబృందం భారతీయ నటీమణులనే ఎంపిక చేసుకోవాలని అనుకుంటోంది. వారికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారు’ అని దక్షిణాది వర్గాలు తెలిపాయి. 
అయితే చిత్రబృందం నుంచి మాత్రం కథానాయిక విషయం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషించనున్నారు. 2020 జులై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో

బాలయ్య సరసన రష్మి [19:54]

మాస్‌లో నందమూరి బాలకృష్ణకు ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రాలు ‘సింహా’, ‘లెజెండ్‌’. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు నటుడిగా ...

బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ [19:41]

ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ విజేతగా బ్రిస్బేన్‌ హీట్‌ ఉమెన్‌ జట్టు నిలిచింది. వరుసగా రెండు సీజన్లో టైటిల్‌ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఉమెన్‌ జట్టుపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం

చట్టాల సవరణలకు సంకల్పించాం: అమిత్‌షా [19:29]

హత్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.

కరణ్‌ డైరెక్షన్‌లో ఆ జోనర్‌లో నటించాలని ఉంది [19:16]

ఈ ఏడాది విడుదలైన ‘కబీర్‌ సింగ్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి కియారా ఆడ్వాణీ. ప్రస్తుతం ఆమె కరణ్‌ జోహార్‌ నిర్మాతగా...