‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’: రాజమౌళికి సల్మాన్‌ సలహా..?

కథానాయికగా ఆమెను ఎంపికచేసుకోమన్నారట!

హైదరాబాద్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ విషయంలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళికి సలహా ఇచ్చారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్‌ చరణ్‌ భార్య సీత పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. తారక్‌కు జోడీగా బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో రాజమౌళి కొత్త కథానాయిక కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ నటి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ను ఎంపికచేసుకోవాలని రాజమౌళికి సలహా ఇచ్చారట. శ్రీలంకకు చెందిన జాక్వెలీన్‌లో కాస్త బ్రిటిష్‌ పోలికలు కూడా ఉన్నాయని, తారక్‌కు జోడీగా జాక్వెలీన్‌ సరిపోతారని సల్మాన్‌.. ‘జక్కన్న’తో అన్నట్లు ఫిలిం వర్గాల సమాచారం.

మరి రాజమౌళి సల్మాన్ సూచన మేరకు ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తారా? లేదా? అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ‘కిక్‌’ చిత్రంతో సల్మాన్‌.. జాక్వెలీన్‌కు బ్రేక్‌ ఇచ్చారు. ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పటికే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో మరో కథానాయికగా శ్రద్ధా కపూర్‌, పరిణీతి చోప్రా, నిత్యా మేనన్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 2020 జులై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

మరిన్ని

పెళ్లి బహుమతిగా ఉల్లి.. [12:50]

ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో  ధరల పెరుగుదలపై ప్రజలు పలురూపాల్లో ....

తిరుపతిలో బాలికపై అత్యాచారం:ఇద్దరి అరెస్ట్‌ [13:36]

దేశంలో మహిళలపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన దిశ ఘటనను మరవక ముందే తిరుపతిలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు! [21:31]

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు...

గచ్చిబౌలి స్టేడియంలో ‘వెంకీమామ’ సందడి [21:16]

అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ ఆదివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేశారు. ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎఫ్‌సీ×ఎఫ్‌సీ...

శివమెత్తిన శివమ్‌ [21:02]

శివమ్‌ దూబే (54, 30 బంతుల్లో 3×4, 4×6) రాణించడంతో వెస్టిండీస్‌కు భారత్‌ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారత్‌కు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM [21:00]

మహిళలపై జరుగుతున్న దురాగతాలను అరికట్టడానికి కొత్త చట్టాలను తీసుకురావడమొక్కటే పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకు రాజకీయ సంకల్పం, పాలనా నైపుణ్యాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇలాంటి...

‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’ [20:42]

నా చుట్టూ మంటలు అలముకున్నాయి. మహా అయితే రెండు మూడు నిమిషాలు బతుకుతా. నేను చెప్పదలచుకున్నది ఒకటే.. నా కుటుంబాన్ని చక్కగా చూసుకో’’ అంటూ దిల్లీ అగ్నిప్రమాద....

మహేశ్‌-విజయశాంతి ఇది గమనించారా? [20:27]

మహేష్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథనాయిక.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు [20:14]

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం  ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే...

మద్యాన్ని ఆదాయవనరుగా భావించం:ఏపీమంత్రి [20:06]

సమాజంలో ఎన్నో అనర్థాలకు మద్యమే కారణమని.. మూడేళ్లలో రాష్ట్రం నుంచి మద్యాన్ని వెలివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో