భార్యకు ప్రేమతో ఓ పెట్టె

పిల్లల బాగోగుల గురించి ఒక తల్లిగా తన భార్య పడుతున్న ఇబ్బందులను చూశాడు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌. దాంతో తన సతీమణి ప్రిసిల్లా చాన్‌కు ఒక గ్లోయింగ్‌ స్లీప్‌ బాక్స్‌ బహుమతిగా ఇచ్చాడు. అంతే కాదు దీనిని స్వయంగా ఆయనే తయారు చేశారు. ‘టైం ఎంతయిందో... పిల్లలు నిద్రలేచారో లేదో అనుకుంటూ ప్రిసిల్లా తరచూ రాత్రుళ్లు తన ఫోనులో సమయం చూసుకునేది. ఆ తరువాత ఓ పట్టాన నిద్ర పట్టక మర్నాడు అలసిపోయేది.   ఇదంతా గమనించిన జుకర్‌ ఆమె కోసం ఈ స్లీప్‌ బాక్స్‌ను తయారు చేసి కానుకగా ఇచ్చాడు. ఈ బాక్స్‌ నుంచి ఉదయం ఆరు - ఏడు గంటల మధ్య చాలా మసక వెలుతురు వెలువడుతుంది. ఆ వెలుతురు ఆమెకు కనిపిస్తుంది. అదే సమయంలోనే వాళ్ల ముద్దుల కూతుళ్లు నిద్ర లేస్తారు. దాన్ని బట్టి సమయం ఆరు లేదా ఏడయ్యిందని అర్థంచేసుకుని నిద్రలేస్తుంది.  ఈ ఉపకరణం ఆమె నైట్‌స్టాండ్‌ మీద ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ‘ఒక తల్లి చాలా కష్టపడాలి. మాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రిసిల్లా రాత్రి వేళల్లో పడుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ఉపకరణం నేను ఊహించిన దానికంటే బాగా పనిచేస్తోంది. ఇప్పుడామె రాత్రి మొత్తం ప్రశాంతంగా నిద్రించగలుగుతోంది. ప్రిసిల్లాపై నాకున్న ప్రేమను, అంకితభావాన్ని వ్యక్తం చేయడానికి ఓ ఇంజినీర్‌గా నేను తయారు చేసిన ఈ ఉపకరణం ఓ పరిష్కారం అని నేను భావిస్తున్నా’నని ఆయన తెలిపారు. మార్క్‌జుకర్‌బర్గ్‌ దంపతులకు నాలుగేళ్లలోపు వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారే మ్యాగ్జిమా, ఆగస్ట్‌.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....