నా పేరు సీత.. నేను గీసిందే గీత

ఆసక్తికరంగా ‘సీత’ ట్రైలర్‌

హైదరాబాద్: కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడు. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫైటింగ్‌, యాక్సిడెంట్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని.. ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడం నవ్వులు పూయిస్తోంది. ఇందులో రామ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) అమాయకపు యువకుడిగా నటించారు. అతన్ని సీతే (కాజల్‌) దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. సోనూ సూద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో మన్నారా చోప్రా మరో కథానాయికగా నటించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

కేసీఆర్‌కు రసాయనాల సీసా పార్శిల్‌ [07:13]

అది సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం.. అక్కడ ఒకే తరహా పెట్టెలు అరవైకి పైగా ఉన్నాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు.

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]

‘వేదిక ఏదైనా సరే..పాక్‌ను ఎదుర్కొంటాం’ [08:50]

కశ్మీర్ విషయంలో పాక్‌ వైఖరిని ఏ వేదికపైన ఎండగట్టడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని ఐరాసలో శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు. కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్‌ చివరకు అంతర్జాతీయ..................

పందెంలో పావురాలు! [08:43]

కోళ్ల పందేలు.. ఎద్దుల పోటీలు చాలా చూశాం. మరి పావురాల పోటీ పెడితే ఎలా ఉంటుంది? చెన్నైలో అదే చేశారు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

గంజాయి అమ్మిన చేతులతో ఉప్పు వ్యాపారం [08:22]

గంజాయి వ్యాపారిలో పరివర్తన తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభించడానికి తోడ్పాటు అందించారు మదురై పోలీసులు.....