కాంగ్రెస్‌ నేతలే మద్దతిచ్చారు

 మండ్య అభ్యర్థి సుమలత ప్రకటన

 

బెంగళూరు : మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ పోటీ ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి సుమలత తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం బెంగళూరు నగరంలో తాను నటించిన ‘డాటర్‌ ఆఫ్‌ పార్వతమ్మ’ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. ‘గెలుపుపై రోజుకో సమీక్ష వస్తోంది. నేను వాటిని అంతగా పరిగణించను. గెలుపోటములపై నాకు ఎటువంటి చింతలేదు. గెలుస్తానన్న విశ్వాసం మాత్రం ఉంది’ అని విశ్లేసించారు. అతిగా విశ్వసించినా బాధపడాల్సి వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సుమలత.. ‘రెబెల్‌స్టార్‌ అంబరీశ్‌ పోటీ చేసిన సమయంలో ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నేను పోటీ చేసిన ఎన్నికల ఫలితాలు కాబట్టి కాస్త కుతూహలంగా ఉండడమూ సహజమే. నేను కాంగ్రెస్‌ నాయకులతో పాల్గొన్న విందు అంశాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కేవలం ఓ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగానే నేను ఆ విందులో పాల్గొన్నా. గెలిచినా, ఓడినా మండ్యలో ఇల్లు మాత్రం కట్టుకుంటా. నాకు కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేసిన విషయం దాచుకోవాల్సిన అంశం కాదు. వారికి వారే బహిరంగంగా ప్రకటించి మరీ నాకు సహకరించారు’ అని స్పష్టం చేశారు. ఓ వైపు తనయుడు నిఖిల్‌ కుమారస్వామి గెలుపు కోసం ముఖ్యమంత్రి కుమారస్వామి దేవాలయాల సందర్శన చేస్తుంటే- సుమలత ఏమాత్రం పట్టనట్లు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం ఆసక్తిగొలిపే అంశం.

మరిన్ని

పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్‌ అసభ్య ప్రవర్తన [06:59]

ఇంజినీరింగ్‌ విద్యార్థినితో ఓ ఇన్విజిలేటర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌  మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌   

నోట్లపై నంబర్లు దొంగను పట్టించాయి [07:24]

పెట్టిన డబ్బులు పెట్టినట్టే పోతున్నాయి. అనుమానించిన యజమాని ఈ సారి నోట్లపై నంబర్లను ముందుగానే రాసిపెట్టుకున్నాడు. ...

ఫర్నిచరైనా.. డబ్బులైనా ఇచ్చేస్తా [08:32]

హైదరాబాద్‌లోని పాత అసెంబ్లీలో స్పీకర్‌ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను అక్కడే వదిలేస్తే నిర్వహణ లేక పాడవుతుందని...

మాజీ మంత్రి కన్నుమూత [09:48]

తెదేపా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా...

వేషం అడగడానికి వెళ్తే.. ‘గెట్‌ అవుట్‌’ అన్నారు! [09:40]

కొన్ని తారలు తళుక్కున మెరుస్తాయి. ఈయన మాత్రం సినీ వినీలాకాశంలో తళతళా మెరుస్తూనే ఉంటారు. సముద్రమంత అనుభవం..

పెళ్లికి నిరాకరించినందుకు వేధింపులు [09:34]

పరిచయాన్ని ఆసరాగా తీసుకొని ఓ మహిళను పెళ్లి చేసుకోమని వేధించాడు.. ఆమె నిరాకరించేసరికి తీరని వేదన కలిగించాడు....

‘ఏ చట్టం ప్రకారం చిదంబరానికి నోటీసులిచ్చారు’ [09:27]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని రెండు గంటల్లోగా దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన..............

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత [09:16]

మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బాబులాల్‌ గౌర్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం .......

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! [09:05]

ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

టాప్‌ 10 న్యూస్ @ 9 AM [09:01]