భారత్‌ వృద్ధి రేటు 7.3%: ఎస్‌అండ్‌పీ

ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2023-24లో 6.5 శాతం భారత్‌ వృద్ధి రేటు ఉంటుందనిఎస్‌ అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2022 ఆఖరు వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ఠ లక్ష్యమైన 6 శాతం కంటే ఎగువనే ఉంటుందని తెలిపింది.

Published : 27 Sep 2022 02:27 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2023-24లో 6.5 శాతం భారత్‌ వృద్ధి రేటు ఉంటుందనిఎస్‌ అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2022 ఆఖరు వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ఠ లక్ష్యమైన 6 శాతం కంటే ఎగువనే ఉంటుందని తెలిపింది. కరోనా పరిణామాల నుంచి కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక వినియోగం దన్నుగా నిలుస్తోందని పేర్కొంది. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందొచ్చు. ఆర్‌బీఐ అంచనా 7.2% కంటే ఇది తక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని