Virat Kohli : కోహ్లీ 30 రన్స్‌ కొడితే సెంచరీ పక్కా: మైఖేల్‌ వాన్‌

మరికొద్దిసేపట్లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య కీలక  పోరు జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే ఈ టెస్ట్‌పై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ జోస్యం చెప్పాడు

Updated : 01 Jul 2022 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొద్దిసేపట్లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య కీలక  పోరు జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే ఈ టెస్టుపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ జోస్యం చెప్పాడు. అతడు ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ‘విరాట్‌ కోహ్లీ చాలాకాలంగా సెంచరీ చేయలేకపోతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌ చేస్తూ 30 పరుగుల మార్క్‌ను అందుకోగలిగితే కచ్చితంగా శతకం చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక ఈ మ్యాచ్‌కు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉన్న బుమ్రా  ప్రపంచ స్థాయి బౌలర్‌. అతడు భీకరఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోకు ఎలా బౌలింగ్‌ చేస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని వాన్‌ తెలిపాడు.

‘బెయిర్‌స్టో ఎటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. న్యూజిలాండ్‌పై అతడి స్ట్రైక్ రేట్ 120గా ఉంది. భారత్‌పై అదే పంథాలో జానీ బ్యాటింగ్‌ చేస్తాడని భావిస్తున్నాను. బుమ్రా, బెయిర్‌స్టో మధ్య కీలకమైన పోరు అభిమానులు చూడొచ్చు. న్యూజిలాండ్‌పై 3 టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరట్‌ అనడంలో నాకెలాంటి సందేహం లేదు. మరో వైపు టీమ్‌ఇండియా గాయాల బెడద, కొవిడ్‌ కారణంగా రోహిత్‌ దూరమవ్వడంతో గందరగోళ పరిస్థితుల్లో ఉంది. నాకు ఇంగ్లండ్ విజయం తప్ప మరేమీ కనిపించడం లేదు’ అని వాన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని