గ్రీన్‌ లేకుండా ప్రపంచకప్‌కా?

కామెరూన్‌ గ్రీన్‌.. టీమ్‌ఇండియాతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా తరఫున ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడు. తొలి టీ20లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్‌ తీసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన అతను.. చివరి టీ20లో 21 బంతుల్లోనే 52 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

Published : 27 Sep 2022 02:31 IST

మెల్‌బోర్న్‌: కామెరూన్‌ గ్రీన్‌.. టీమ్‌ఇండియాతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా తరఫున ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడు. తొలి టీ20లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్‌ తీసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన అతను.. చివరి టీ20లో 21 బంతుల్లోనే 52 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తన పేస్‌ బౌలింగ్‌, చురుకైన ఫీల్డింగ్‌తోనూ జట్టుకు ఉపయోగపడే ఈ కుర్రాడు ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ జట్టులో లేకపోవడం గమనార్హం. జట్టును ఎంపిక చేసేటప్పటికి గ్రీన్‌ ఓ మోస్తరుగానే ఆడుతున్నాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు వార్నర్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రయోగాత్మకంగా అతణ్ని ఓపెనర్‌గా పంపగా.. గొప్పగా రాణించాడు. దీంతో అతణ్ని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టీమ్‌ఇండియాతో సిరీస్‌లో అంతగా ఆకట్టుకోని స్టీవ్‌ స్మిత్‌ స్థానంలో గ్రీన్‌ను ఎంపిక చేసే అవకాశాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గాయం వల్ల భారత్‌తో సిరీస్‌కు దూరమైన మరో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ప్రపంచకప్‌ సమయానికి కోలుకునే అవకాశం లేకున్నా.. గ్రీన్‌ను అవకాశం దక్కినట్లే. ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ జట్లను ప్రకటించినప్పటికీ.. అక్టోబరు 9 లోపు మార్పులు చేసుకోవడానికి అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని