IND vs ENG: ఇంగ్లాండ్‌తో పోరులో భారత ఐదో బౌలర్‌ ఎవరు?

ఇంగ్లాండ్‌తో గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టు మరికొద్దిసేపట్లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ప్రారంభంకానుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తరఫున ఐదో బౌలర్‌గా...

Updated : 01 Jul 2022 14:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టు మరికొద్దిసేపట్లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ప్రారంభంకానుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తరఫున ఐదో బౌలర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. ఇప్పటికే బుమ్రా, షమి, సిరాజ్ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు చూసుకుంటారని తెలుస్తుండగా స్పిన్‌ విభాగంలో ఎవరిని తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.

అయితే, ఇక్కడ టీమ్‌ఇండియా ఒక స్పిన్నర్‌ను తీసుకోవాలా లేక ఇద్దరినీ తీసుకోవాలా అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అశ్విన్‌, జడేజాను తీసుకుంటే ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లతో లెక్క సరిపోతుంది. లేదా ఇద్దరిలో ఒక్కర్నే తుది జట్టులోకి తీసుకుంటే నాలుగో పేసర్‌గా శార్దూల్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ సాధారణంగా పేస్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఐదో బౌలర్‌గా శార్దూల్‌నే  తీసుకునే వీలుంది. మరోవైపు గతేడాది ఇదే సిరీస్‌లో అశ్విన్‌ వంటి కీలక స్పిన్నర్‌ను పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు జడేజా, శార్దూల్‌ తమ శక్తిమేరకు రాణించారు.

భారత జట్టు అంచనా: శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌/విహారి/కేఎస్‌ భరత్‌, పుజారా, కోహ్లి, శ్రేయస్‌, పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌/అశ్విన్‌, షమి, సిరాజ్‌, బుమ్రా.

పిచ్‌ ఎలా ఉంది..?

కాగా, ఈ టెస్టు మ్యాచ్‌లో తొలి రెండు రోజుల పాటు ఆటకు వర్షం వల్ల అంతరాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మూడో రోజు నుంచి వాతావరణం మెరుగుపడుతుందని తెలుస్తోంది. ఇక ఈ పిచ్‌పై సాధారణంగా పరుగులు బాగానే వస్తాయి. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 307 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 320. మూడో ఇన్నింగ్స్‌ సగటు 244 ఉండగా.. నాలుగో ఇన్నింగ్స్‌ సగటు 152 మాత్రమే. ఇక్కడ సాధారణంగా పేసర్లకు మంచి స్వింగ్‌ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు